తెలంగాణ లో తమ భవిష్యత్తు కోసం ప్రభుత్వంతో వీరోచిత పోరాటం చేస్తున్న లక్షలాది నిరుద్యోగ బిడ్డలకు సంఘీభావంగా, గ్రూప్2 పరీక్షను మూడు నెలలు వాయిదా వేయాలన్న డిమాండ్‌ను పూర్తిగా సమర్థిస్తూ, ఈ రోజు మేము గన్ పార్క్ దగ్గర ‘శాంతియుతంగా’ సత్యాగ్రహం చేద్దామని నిర్ణయించాము. కానీ #KCR ప్రభుత్వం నన్ను, మా నాయకులనందరినీ గృహ నిర్భందంలో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది #BSP కార్యకర్తలను పోలీసులు నిర్భందించారు. అయినా మేం సత్యాగ్రహాన్ని కొనసాగిస్తున్నాం. తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకూ మా పోరాటం వివిధ రూపాల్లో తెలంగాణ గడ్డ మీద కొనసాగుతూనే ఉంటది.
కేసీఆర్ తన పోలీసు బలగాలతో మా ప్రజాస్వామిక హక్కులను కాలరాసినా తెలంగాణ తన విముక్తి పోరాటం ఆపదు. కొందరి పాలైన తెలంగాణ, అందరి తెలంగాణ గా మారేదాకా మడమ తిప్పేది లేదు.
Today’s Satyagraha is against the fascist oppression of KCR’s government on unemployed youth and denial of all fundamental rights granted by the constitution to the citizens who want to express dissent peacefully in #Telangana.
It is going to be a ‘Silent Protest’ from 10AM to 4PM.
Pl forgive me, if I don’t answer your calls🙏
#postponegroup2
#VR99
#RSPHouseArrest
#BSP4Youth
కేసీఆర్ తెలంగాణలో ప్రభుత్వ భూములను కాపాడితే బదిలీ బహుమతి. రహస్య జీవోలు తీసి బినామీలకు అప్పగిస్తే రిటైర్మెంటు తరువాత కూడా అపరిమిత పరపతి. రిటైరయిన తరువాత ఎవరినైనా కీలక పదవుల్లో కొనసాగిస్తున్నరంటేనే పాలకులు దోపిడీకి రాజమార్గం వేస్తున్నరని అర్థం చేసుకోవాలి.
Dear Retired Senior Colleagues,
While you served the nation to the best of your ability, I feel you should turn down all the offers to serve in the ‘important’ posts where there is bound to be conflict of interest. You should rather groom and mentor young officers so that they follow righteous path. What is deeply disturbing is many of you are often times colluding with the rulers in exploitation of innocent masses. All times won’t be same and when people yearn for change, I am afraid some of you, along with the rulers, might face wrath of the masses. Remember French Revolution!
#BSPstandsByPamelaIAS
#LiberateTelangana
#FifthRev
#VR99
Issues in Osmania university - Fee hike, 920 Vacant faculty posts, cheap accommodation and infrastructure - toilets, rooms, mess…, removing courses, drop in University ranking. All caused due to low budget allocation. Where is our money going? #SaveOU
బహుజనవాదాన్ని (విధి లేక) మోయడానికి నానా తంటాలు పడుతున్న కల్వకుంట్ల కుటుంబానికి అభినందనలు. చక్కటి ఫోటోతో మంచి పతాక శీర్షికను ఇచ్చిన ‘నమస్తే’ పత్రిక తీగుళ్ల కృష్ణమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఇక మిగిలిందల్లా,
(CM) కుర్చీ ఖాళీ చేయడమే..
ప్రగతి భవన్‌ను బహుజనులపరం చేయడమే..
మీ అక్రమ ఆస్తులను తెలంగాణ జాతికి అంకితం చేయడమే..
గన్ పార్క్ వద్ద ముక్కు నేలకు రాకడమే..
ఇక డ్రామాలు ఆపి
ముహూర్తం నిర్ణయించండి…
పైవన్నీ మీరు చేయకపోతే,మేమే చేసి చూపిస్తం👊
ఇదే తెలంగాణ వేయికళ్లతో ఎదురుచూస్తున్న బ్రేకింగ్ న్యూస్!
#LiberateTelangana
#FifthRevolution
#VR99%
It is we who make the society and it is we who need to make a happy society.
Our Telangana needs us. Join the bahujan movement to change the lives of billions. Thankyou for the unwavering support @RSPraveenSwaero sir.
బహుజన రాజ్యాధికారం కోసం
"బహుజన విద్యార్ధి గర్జన "
జులై - 20 - 2023
వేదిక : నేరెళ్ల వేణుమాధవ్ ప్రాంగణం , పబ్లిక్ గార్డెన్ , హన్మకొండ .
సమయం : ఉదయం 10 గంటలకు
ముఖ్య అతిధి :
బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి
డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ IPS (VRS)
BSP తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష్యులు
#IamRSP #BSP4Telangana #KCRfailedTelangana #ElephantThisTime #BSP4Students #Education #Schools #Colleges #Universities @RSPraveenSwaero@BITCELL_BSP @BSP4Telangana
"అక్రమ ఇసుక దోపిడీలో అలసిపోయి మొక్కలైన లారి బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా గిట్లనే కూలిపోతుందేమో"తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మండలం అనాజిపూరం గ్రామ సమీపంలో తిరుమలగిరి వలిగొండ ప్రధాన రహదారి పై లారి ఫిట్ నెస్ లోపం వలన జరిగిన ప్రమాదం@BITCELL_BSP@RSPraveenSwaero@PallaviSwaero3
పౌర హక్కుల నేత, రిటైర్డ్ ప్రొఫెసర్ హరగోపాల్ ,POW సంధ్య లపై UAPA యాక్ట్ కింద కేసు నమోదు చేయడాన్ని #BSP ఖండిస్తున్నది. ప్రజల హక్కుల కోసం పనిచేసే వారిపై తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి కేసులు నమోదు చేయడం అంటే సామాన్యుడి తరపున ఎవరూ నోరు మెదపకుండా భయపెట్టే వ్యూహంలో భాగమే.
ఎంతోమంది IAS,IPS,IFS లాంటి వేలాది మంది సివిల్ సర్వేంట్లకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో తర్ఫీదునిచ్చిన
ప్రొ. హరగోపాల్ ఒక నిష్పక్షపాత మేధావిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేశారు.
యాంత్రికంగా కొంతమంది మేదావులు, హక్కుల కార్యకర్తలపై పెట్టిన తాడ్వాయి UAPA కేసు నాడు భీమ్ కోరేగావ్ కేసులో కంప్యూటర్లను హ్యాక్ చేసి, తప్పుడు ఆధారాలు,సాక్ష్యాలతో పౌర హక్కుల నేత స్టాన్లీ స్వామి,ఆనంద్ తెల్తుంబ్డే, గౌతమ్ నవ్లాక లాంటి వాళ్లపై రాజ్యం మోపిన అక్రమ కేసుల కోవలోకే వస్తుందని నా అభిప్రాయం.
గిరిజనుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన స్టాన్లీ స్వామికి UAPA కేసులో విముక్తి ప్రసాదించండని వేడుకోగా ప్రభుత్వం తన అభ్యర్థనకు తిరస్కరించి,కర్కశంగా వ్యవహరించడంతో కస్టడీలోనే చనిపోయారు.
వామపక్ష తీవ్రవాద సమస్య పరిష్కరించడం కోసం ఇలాంటి రాతియుగపు చట్టాల కన్న,సమాజంలో ఉన్న సామజిక, ఆర్థిక,రాజకీయ సమస్యల మూలాలకు వెళ్లి శోధిస్తే తప్ప పరిష్కారం దొరకదు. దేశ సంపదను ప్రజాస్వామీకరిస్తేనే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది.
దేశ సంపదను పిడికెడు మంది చేతిలో పెట్టి,ఉత్పత్తి శక్తులుగా ఉన్న 90% మంది ప్రజలను కేవలం ఓటర్లుగా, బానిసలుగా చూసినంత కాలం ప్రజల్లో అసంతృప్తి రగులుతూనే ఉంటుంది. ఆ అసంతృప్తిని వ్యక్తపరచడం కోసం,ఒక బలమైన గొంతుక కోసం అట్టడుగువర్గాల ప్రజలు నిత్యం ఎదురు చూస్తూనే ఉంటారు.ఈ ఆధిపత్య,దోపిడీ ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతుకలను గౌరవించాలి. వాళ్ళ దృక్కోణం నుంచి కూడా సామజిక సమస్యలను అర్థం చేసుకుంటే బాగుంటుంది.
కేవలం కొద్దిమంది కుబేరుల చేతిలో బందీ అయిన నేటి పాలక ప్రభుత్వాలు #UAPA లాంటి నల్ల చట్టాలను నమ్మకుంటాయి తప్ప, ప్రజాస్వామిక చర్చలను నమ్మవు.
అయితే ఈ సమస్యకు పరిష్కారం #UAPA లాంటి చట్టాలను రద్దు చేయడం.ఇది దేశానికి ఇప్పుడు అత్యవసరం.ఇదీ కేవలం బహుజన రాజ్యం తోనే సాధ్యం.
మాన్యశ్రీ కాన్షీరాం చెప్పినట్లుగా విప్లవం పేరుతో మారణాయుధాలు కాకుండా, 'ఓటు' అనే ఆయుధంతో బ్యాలెట్ విప్లవం సృష్టించి బహుజన రాజ్యం సాధిద్దాం. దేశంలో ఇలాంటి నల్ల చట్టాలను రద్దు చేస్తేనే ప్రజాస్వామ్యం ఫరిడవెల్లుతుంది. అప్పుడే దేశ పీడిత ప్రజలు హర్షిస్తారు. ఇదే ప్రజాస్వామిక వాదుల ముందున్న తక్షణ కర్తవ్యం. జై భీం.✊