హే రామ్... ఆలయాలను రక్షించండి..
ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి అంటూ YS జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్ధితులు చాలా అన్యాయంగా ఉన్నాయంటూ YS జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో శతాబ్దాల నాటి అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూల్చి వేయించింది.
ఈ మహపచారంపై YS జగన్ X వేదికగ స్పందించారు.
శతాబ్దాల చరిత్ర కలిగిన ఆంజనేయపురం అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు YS జగన్. కోట్లాది మంది భక్తుల మనోభావాలపై కూటమి ప్రభుత్వం దాడి చేసిందన్నారు.
తిరుమలలో చారిత్రక వేయి కాళ్ల మండపం కూల్చివేతతో మొదలైన విధ్వంసం.. కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో 40 దేవాలయాలు కూల్చారని మండిపడ్డారు YS జగన్.
బద్వేలులోని కాశీనాయన క్షేత్రంలోనూ సత్రాలను కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయాలను అన్వేషించకుండా పవిత్ర ఆలయాలపై బుల్డోజర్లు నడపడమేనా మీ పాలన అంటే అని చంద్రబాబు సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు YS జగన్.
దేవాలయాల నిర్మాణం, పునరుద్ధరణ కోసం YSRCP ప్రభుత్వం శ్రీవాణి ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆలయాలను కూలుస్తుందన్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పే చంద్రబాబు.. ఆలయాల కూల్చివేతను ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. సనాతన ధర్మం అంటే ఇదేనా చంద్రబాబూ అంటూ ఘటుగా ప్రశ్నించారు YS జగన్. ఆలయాలను కాపాడే బాధ్యత కూటమి ప్రభుత్వానికి లేదా..? అని X వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు YS జగన్.
అసలు... YS జగన్ కంటే ముందు బీజేపీ నేతలు స్పందించాలి.. బీజేపీ నేతల కంటే ముందు సనాతన ధర్మ పరిరక్షకుడని అని చెప్పుకునే పవన్ కల్యాణ్ స్పందించాలి. హిందూ ధర్మపరిరక్షులమని చెప్పుకునే బీజేపీ, పవన్ ఎందుకు ఆలయాల కూల్చివేతపై స్పందించడం లేదు. మీ ప్రభుత్వంలో జరుగుతోన్న ప్రశ్నించాల్సిన బాధ్యత మీకు లేదా..? మీరు చంద్రబాబును ప్రశ్నించకపోతే.. ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు.
#YSJagan #AbhayanjaneyaSwamyTemple #tirupathi #Renigunta #SrivaniTrust @YSRCParty@ysjagan@we_ysrcp@YSRCPLegalCell@YSRCPCommanders@YSRCPAmerica@ysrcp_usa@ysrcp_usa@YSRCPEurope@YSRCP_Italy@YSRCP_Germany@YSRCPResurgence@VizagYSRCP@VizianagaramYCP@GunturYSRCP@Ysrcp_Tirupathi@Ysrcp_Tirupathi
ఎన్విడియా సీఈవోగా మళ్లీ జాన్సన్ హువాంగ్
హువాంగ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న బోర్డు సభ్యులు
తక్షణమే సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న హువాంగ్
నవంబర్ 11న రాజీనామా చేసిన జాన్సన్.
#NVidia#JensenHuang#HuangReturns#HuangBack
2024 చిత్తూరు లోక్ సభ, అసెంబ్లీ పోలింగ్‌లో అక్రమాలు
రిపోర్టర్స్ కలెక్టివ్ పరిశోధనలో వెల్లడి
2024 ఎన్నికల్లో చిత్తూరు లోక్‌సభ స్థానంలో సాయంత్రం 6 గంటలకు క్యూలో ఉన్న ఓటర్ల సంఖ్య 56,067
ఈసీఐ రికార్డుల్లో ఓటర్ల సంఖ్య 56,067గా నమోదు
అదే చిత్తూరు లోక్‌సభకు చెందిన ఏడు అసెంబ్లీ స్థానాల్లో మాత్రం 6 గంటలకు క్యూలో ఉన్న ఓటర్లు కేవలం 24,596
ఒకే బూత్‌లు, ఒకే క్యూలు, ఏకకాలంలో ఎన్నికలు జరిగినా 31 వేలకు పైగా ఓట్ల తేడా
ఈ తేడాల గురించి అడిగినా పట్టించుకోని ఈసీ
చంద్రబాబు కుప్పం నియోజకవర్గం కూడా చిత్తూరు లోక్ సభ సెగ్మెంట్ లోనే
ఈవీఎం లోపాలు, హింస కారణంగా పోలింగ్ రాత్రి 2 గంటల వరకు కొనసాగిందన్న ఏపీ సీఈఓ
ఆలస్య పోలింగ్ వ్యవస్థీకృత మోసానికి సంకేతమని ప్రతిపక్షాలు ఆరోపణ
చంద్రబాబు గెలిచిన కుప్పం అసెంబ్లీ సీటు కూడా ఈ చిత్తూరు లోక్‌సభ పరిధిలోనే
2024లో చిత్తూరు లోక్‌సభతో పాటు ఏడు అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న టీడీపీ
,,,
సింగిల్ లైన్లో YSRCP సంచలన ట్వీట్
ఆ 31,471 ఓట్లు ఎక్కడికి పోయాయో? అంటూ ట్వీట్
చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అక్రమాలపై YSRCP పోస్ట్
2024 నాటి పోలింగ్ అక్రమాలను ఇప్పటికే బయట పెట్టిన 'ద రిపోర్టర్స్ కలెక్టీవ్'
'ద రిపోర్టర్స్ కలెక్టీవ్' వివరాలను ఉటంకిస్తూ YSRCP పోస్ట్
ఆనాటి YS జగన్ వీడియోను కూడా ట్విట్ చేసింది YSRCP
#YSRCP #ReportersCollective @YSRCParty@ysjagan@YSRCPLegalCell@ysrcp_usa@YSRCP_Germany@YSRCP_Italy
షర్మిల భర్తకు చంద్రబాబు భారీ గిఫ్ట్
షర్మిల భర్త బినామీ కంపెనీ 'ఆమోద'కు 50 ఏళ్ల మైనింగ్ లీజ్
చంద్రబాబు డైరెక్షన్లో షర్మిల నడుస్తున్నారనేందుకు మరో సాక్ష్యం
ఇవన్నీ కప్పి పెట్టి జగన్‌పై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న ఎల్లో మీడియా
స్థానిక ఎన్నికల్లో హింస, అక్రమాలను కప్పిపెట్టేందుకు..
ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు కుట్ర రాజకీయాలు..!
చంద్రబాబు మైనింగ్ గిఫ్ట్ ఇవ్వడం వల్లనే..
కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించడానికి షర్మిల సిద్ధమయ్యారా..?
#Sharmila #BrotherAnil #YSJagan #YSRCP #APNews #AndhraPradehNews @YSRCParty@we_ysrcp@YSRCPLegalCell@ysrcp_usa@YsrcpKuwait@YSRCP_Germany@YSRCP_Italy@YSRCPEurope@YsrcpYsr@ukysrcp
ఒక నాయకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో.. కచ్చితంగా అలాంటి లక్షణాలే YS జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయి.ఈ లక్షణాలు జన్మతః వచ్చాయనే అనుకోవాలి. కొండంత సహనం, అంతకు మించి ఓర్పు. వీటికి మించిన ధైర్యం, మొండి పట్టుదల. YS జగన్మోహన్ రెడ్డిలో మెండుగా కనిపిస్తాయి. ఆయన కాంగ్రెస్ పార్టీని, టీడీపీని ఢీ కొట్టినప్పుడు ఎంత ధైర్యంగా పోరాడారో.. చెల్లెలు షర్మిల విషయంలో ఓర్పు, సహనంతో ఉన్నారు.
YSR కుటుంబ రాజకీయ శత్రువులు, ప్రత్యర్ధులతో షర్మిల కుట్రలు చేస్తున్నా.. YS జగన్మోహన్ రెడ్డి తొణకలేదు, బెనకడం లేదు. గుండెలో చెప్పుకోలేని బాధ ఉండే ఉంటుంది.మనసును పిండేసి బాధ ఉండే ఉంటుంది. ఆ బాధను చిరు నవ్వు చాటున దాచేస్తున్నారు YS జగన్. YSRకు కుటుంబం ఎంత ముఖ్యమో.. YS జగన్‌కు కూడా అంతే ముఖ్యం. అందుకే.. రాజకీయ ప్రత్యర్దులు ఎన్ని ఎత్తులు వేస్తున్నా.. ఎన్ని కుట్రలు పన్నులున్నా..చెల్లెలను అడ్డు పెట్టుకుని దెబ్బ కొట్టాలని చూస్తున్నా YS జగన్ అన్ని మౌనంగా భరిస్తున్నారు.
ఏ అన్నా.. చెల్లిని చూసుకోనంత ప్రేమగా షర్మిలను చూసుకున్నారు YS జగన్. షర్మిలకు పెళ్లైన 25 ఏళ్ల తరువాత కూడా తాను సంపాదించుకున్న దానిలోంచి రూ.230 కోట్లు ఇచ్చారు. చెల్లెల మీద ఎంత ప్రేమ ఉంటే వందల కోట్లు ఇవ్వాలి. అయినా.. షర్మిలకు సరిపోలేదు. షర్మిల చిన్న నాటి నుంచే మొండిఘటం. బిడ్డను వదిలేస్తే.. ఏమైపోతుందో అనే భయం విజయమ్మలో ఉండి ఉంటుంది. దీనిని ఆసరాగా చేసుకుని విజయమ్మను షర్మిల బ్లాక్ మెయిల్ చేస్తుందా..? లేకపోతే.. కూతురు వివాహం రెండు రోజుల్లో పెట్టుకుని ఈ రాద్దాంతం ఏంటి..?. ఎవరైనా ఇలా చేస్తారా..? అన్న మీద ఎంత కోపం ఉంటే మాత్రం రాజకీయ ప్రత్యర్ధులతో కలిసి కుట్రలు పన్నుతారా..?. రాయలసీమ బిడ్డ ఎలా ఉండాలి..? అన్న కోసం ప్రాణమిచ్చేలా ఉండాలి కానీ.. ఈ కుట్రలు ఏంటి..? ఈ స్కెచ్‌లు ఏంటి..? మీరు ఆలోచిస్తున్నది..? మీరు చేయబోయేది ఎల్లో మీడియాకు ముందే ఎలా తెలుస్తుంది..?. ఎల్లో మీడియాకు ఎవరు లీకులు ఇస్తున్నారు..?లేకపోతే ఎల్లో మీడియానే మీ కుట్రల్లో ప్రత్యక్షంగా భాగస్వామి అవుతుందా..?
యలహంక హౌజ్‌పై సిలికాన్ బిల్డర్స్ దేవనహల్లి కోర్టులో దావా వేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు యలహంక లోకి ప్రవేశించవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. షర్మిల, ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు ఎవరూ యలహంక దరిదాపుల్లోకి వెళ్లొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.భద్రతా కారణాలతోనే యలహంక హౌజ్ లో పెళ్లికి అభ్యంతరం చెప్పినా... షర్మిల ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకెళ్లడం బాధాకరం.
ఇప్పటికైనా షర్మిల వాస్తవాలు గ్రహించాలి. మొండిగా ముందుకెళ్లకుండా.. ఎల్లో మాయలో పడకుండా నిజాలను, వాస్తవాలను చూడాలి. చంద్రబాబుకు వెడ్డింగ్ కార్డు ఇచ్చినందుకే కోట్లాది మంది YSR అభిమానులు బాధ పడుతున్నారు. చంద్రబాబు రాజకీయంగా కష్టాల్లో ఉంటే.. షర్మిల వచ్చి డైవర్షన్ చేస్తుందని ప్రజలు అనుకుంటున్నారు. అన్నను షర్మిల ఇబ్బంది పెట్టడాన్ని YSR అభిమానులు, YS జగన్ అభిమానులు, YSRCP సానుభూతిపరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా షర్మిల తన మైండ్ సెట్ మార్చుకోవాలి. Stubbornness నుంచి షర్మిల బయటపడాలి. Rigidityని షర్మిల వదిలించుకోవాలి. Egocentrism నుంచి షర్మిల ముందుగా బయటపడాలి.Psychological Reactance దీనిని నుంచి షర్మిల ప్రధానంగా బయట పడాలి. YSR బిడ్డగా YSR కళ్లతో షర్మిల ఈ లోకాన్ని చూడాలి. అప్పుడు మీకు నీ వాళ్లు ఎవరో.. మీ ప్రత్యర్ధులు ఎవరో.. మీ శత్రువులు ఎవరో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే.. ఎల్లో కుట్రలకు YS జగన్ చెక్ పెట్టాడనే చెప్పాలి. YS జగన్‌లోని ఓర్పు, సహనమే పచ్చ కుట్రలకు చెక్ పెట్టేలా చేశాయి. షర్మిల ఇంత రాద్ధాంతం చేస్తున్నా.. అన్నగా మౌనంగా భరించారు తప్పితే.. ఒక్క మాటైనా జగన్ మాట్లాడారా..?.ఏం జరుగుతుందో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. పచ్చ పాపాలను ప్రజలు లెక్కిస్తున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు ఎల్లో బ్యాచ్‌కు ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు.
#YSJagan #Sharmila #Yalahanka #YSRCP #TDP #CBN @YSRCParty@ysjagan@ysrcp_usa@YSRCP_Italy@YSRCP_Germany@YSRCPEurope@YsrcpRe51288@YSRCPLegalCell@YSRCPWomenVoice@Ysrcp_womens@YSRCPWWOfficial@we_ysrcp@YsrcpKuwait@UttarAndhraYCP@YSRCPGUDUR@bandarysrcp@GunturYSRCP@YSRCPCommanders
చంద్రబాబు, ABN రాధాకృష్ణకు ఇచ్చిపడేసిన సతీష్ రెడ్డి..!
షర్మిలతో కలిసి చంద్రబాబు రాజకీయ కుట్రలు చేస్తున్నారు..
చంద్రబాబు నెట్ వర్త్ వేల కోట్ల రూపాయల పైమాటే
మరి.. చంద్రబాబు ఆయన చెల్లెళ్లకు వాటా ఇచ్చారా..?
అలానే..
చంద్రబాబు అడుగులో అడుగులేసే ABN రాధాకృష్ణ, టీవీ5 అధినేతకు కూడా అక్కాచెల్లెళ్లు ఉంటారు కదా..? వారు ఎంత ఆస్తి ఇచ్చారో.. పంచారో చెప్పాలి.
ఆ విషయం వీళ్లు చెప్పరు.. ఎవరూ అడగకూడదు..
కానీ.. జగన్ ఆస్తిలో వాటా అడగడానికి మాత్రం షర్మిలను ఉసి గొల్పుతారంటూ నిప్పులు చెరిగారు YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SV సతీష్ రెడ్డి.
#SVSateeshReddy #SateeshReddy #YSJagan #Sharmila #CBN #ABNRadhaKrishna #APNews #TeluguNews #AndhraPradeshNews @YSRCParty@YSRCPCommanders@we_ysrcp@ysjagan@ysrcp_usa@YSRCPEurope@YSRCP_Italy@YSRCP_Germany@VizagYSRCP@VizianagaramYCP@UttarAndhraYCP@ysrcpaus@GunturYSRCP
యలహంక ఆస్తి భారతమ్మ తల్లిదండ్రులది..
షర్మిల మీ రాద్ధాంతం ఏంటి..?
యలహంక ఆస్తి YSR కుటుంబ ఆస్తి కాదు..
భారత తండ్రి ఈసీ గంగిరెడ్డి ఆస్తి.
యలహంక ఆస్తి భారతమ్మకు ఆమె తల్లితండ్రులు ఈసీ గంగిరెడ్డి - సుగుణమ్మ ఇచ్చారు.
మరీ.. ఈ ఆస్తిలో షర్మిలకు వాటా ఎందుకు ఉంటుంది..?
ఒకవేళ యలహంక ఆస్తి YSR కుటుంబానిదే అయితే..
వీళ్ల ఫ్యామిలీకి చెందిన వారి పేర్ల మీద ఆస్తి ఉండేది కదా..?
క్లియర్ రికార్డులు చెబుతున్నదేమంటే..
యలహంక ఆస్తి భారతమ్మకు ఆమె తల్లిదండ్రులు ఈసీ గంగిరెడ్డి - సుగుణమ్మ పెట్టారని YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి చెప్పారు.
అంతేకాదు సతీష్ రెడ్డి షర్మిలకు పలు ప్రశ్నలు సంధించారు.
1.20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నారని షర్మిల అంటున్నారు..
కనీసం ఒక్క కరెంట్ బిల్లు అయినా షర్మిల పేరు మీద ఉందా..?
2.కరెంట్ బిల్లు కానీ.. వాటర్ బిల్లు కానీ..
కనీసం ఏదో ఒక బిల్లు షర్మిల పేరు మీద ఉండాలి కదా..?
మరి లేదంటే.. షర్మిలకు ఆ ఆస్తితో సంబంధం ఎలా ఉంటుంది..?
యలహంక ఆస్తిలో వాటా ఉందని షర్మిల ఎందుకు రాద్ధాంతం చేస్తుందో అర్ధం కావడంలేదన్నారు సతీష్ రెడ్డి.
#YSRCP #SateeshReddy #YSJagan #Sharmila #APNews #AndhraPradeshNews @YSRCParty@ysjagan@ysrcp_usa@YSRCPEurope@we_ysrcp@YSRCP_Germany@YSRCP_Italy@ysrcpaus@VizagYSRCP@pappireddysure1@YSRCPWomenVoice@YSRCPWWOfficial@YSRCPLegalCell@GunturYSRCP
షర్మిల పన్నాగం అట్టర్ ప్లాప్..!
చంద్రబాబు స్కెచ్..
ఎల్లో మీడియా ఓవరాక్షన్..
షర్మిల యాక్షన్ అట్టర్ ప్లాప్ ..!
యలహంక హౌజ్ తనదేనంటూ బెంగళూరు బయల్దేరారు షర్మిల.
కూతురి పెళ్లి మూడు రోజులు పెట్టుకుని.. పెళ్లి పనులు కూడా పక్కన పెట్టి.. బెంగళూరు వెళ్లారు.
బెంగళూరు విమానాశ్రయం నుంచి షర్మిల బయటకు రాగానే.. ఆమె కారును బెంగళూరు పోలీసులు అడ్డుకున్నారు. " మేడం.. కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి.. మీరు వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుంది.. సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా మీరు వెళ్లకూడదు" షర్మిలతో పోలీస్ అధికారి చెప్పిన మాటలివి. "మిమ్మల్ని ఫాలో అవుతామ్" అని కూడా పోలీస్ అధికారి చెప్పారు. దీంతో.. షర్మిల లీలా ప్యాలెస్ హోటల్‌కు వెళ్లారు.
పోలీసులు అడ్డుకోవడం.. షర్మిల లీలా ప్యాలెస్ హోటల్‌కు వెళ్లడంతో.. పాపం.. ఎల్లో మీడియా హూషారు అంతాపోయింది. అందరూ.. ఏపీ పోలీసుల్లా ఉండరు కదా..?!.
#Sharmila #YSJagan #YSRCP #YellowMedia #TDP #CBN @YSRCParty@ysjagan@ysrcp_usa@YSRCP_Italy@YSRCP_Germany@ysrcpaus@YSRCPEurope@YSRCPUSA@VizagYSRCP@YSRCPLegalCell@YSRCPCommanders@YSRCPWWOfficial
YSR కుటుంబ పరువు తీస్తున్న షర్మిల
షర్మిల రాజకీయ పంతం.. రాజకీయంగా ఆమె గొయ్యి ఆమె తవ్వుకున్నట్లు ఉంది.
YSRను, YS జగన్ రాజకీయ ప్రత్యర్ధులతో షర్మిల కలవడాన్ని, కలిసి కుట్రలు చేయడాన్ని YSR, YS జగన్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.
షర్మిల చారిత్రక తప్పిదం చేస్తున్నారు.. ఆమె నిర్ణయాలు వల్ల ఆమె కుటుంబంపై..ఆమె పిల్లలపై ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది కూడా YSRCP వర్గాల్లో చర్చ జరుగుతోంది.
చంద్రబాబుకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే చర్యలకు షర్మిల దిగుతున్నారని YSRCP నేతలు అనుకుంటున్నారు.
తనది కాని ఆస్తి కోసం షర్మిల చేస్తున్న రాద్దాంతంపై YSR అభిమానులు మండిపడుతున్నారు.
రాజకీయ దురుద్దేశంతోనే షర్మిల వారానికోసారి రచ్చ చేస్తున్నారు అనేది చాలా మంది అభిప్రాయం.
మూడు రోజుల్లో కుమార్తె పెళ్లి పెట్టుకుని షర్మిల రచ్చ చేయడంపై ప్రజలు కూడా ఏంటిదీ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
షర్మిలకు కుటుంబ గౌరవం ముఖ్యం కాదు.. ఆమె రాజకీయ పంతం దిశగా కుట్రలు పన్నుతున్నట్లు స్పష్టమవుతుంది.
YS జగన్మోహన్ రెడ్డి కోట్లాది మంది గుండెల్లో కొలువై ఉన్నారు.. ఆ అభిమానాన్ని చంద్రబాబు - షర్మిల కుట్రలు తుడిచేయగలవా..?
#CBN #Sharmila #YSJagan #YSRCP #TDP #APNews #AndhraPradeshNews #TeluguNews
#YelowMedia @YSRCParty@we_ysrcp@YSRCPCommanders@ysjagan@ysrcp_usa@YSRCP_Germany@YSRCP_Italy@YsrcpKuwait@ysrcpaus@YSRCPEurope@UttarAndhraYCP@YSRCPWomenVoice
అంతా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే..!
ఏపీలో జరుగుతోన్న హింస, ప్రజాసమస్యలను డైవర్షన్ చేసే యత్నం
షర్మిల ఎపిసోడ్లో చంద్రబాబు కొత్త డ్రామా
సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ మొదలు షర్మిల బెంగళూరు పర్యటన వరకు ఎల్లో మీడియా హంగామా
YS జగన్‌పై విష ప్రచారమే లక్ష్యం. వ్యక్తిత్వ హననానికి యత్నం
యలహంక ఆస్తిపై కోర్టు ఆదేశాలతో మూతపడ్డ బాబు అండ్ కో మాటలు
సొంత చెల్లెళ్లు.. తమ్ముడికి ఎలాంటి ఆస్తి ఇవ్వని చంద్రబాబు
పెళ్లైన 25 ఏళ్ల తరువాత కూడా షర్మిలకు రూ.230 కోట్లు ఇచ్చిన YS జగన్
భద్రతా కారణాలోనే బెంగళూరు నివాసంలో వివాహానికి అభ్యంతరం
లోటస్ పాండ్ ఉపయోగించుకోవాలని లేఖలో కోరిన YS జగన్
అయినా.. YS జగన్ పై ఎల్లో మీడియా విష ప్రచారం
YS జగన్ పేరు వినపడగానే శివాలెత్తిపోతున్న ఎల్లో మీడియా
అన్నాచెల్లళ్ల మధ్య బిగ్ ఫైట్ అంటూ అత్యుత్సాహం ప్రదర్శించిన ABN ఛానల్
#YellowMedia #CBN #Sharmila #YSJagan #APNews #AndhraPradeshNews #Yalahanka @YSRCParty@ysjagan@we_ysrcp@ysrcp_usa@YSRCPLegalCell@YSRCP_Italy@YSRCP_Germany@YsrcpKuwait@YSRCPUSA@VizagYSRCP@GunturYSRCP
చంద్రబాబు కనుసన్నల్లో మరో డ్రామాకు తెరతీసిన షర్మిల
కుమార్తె పెళ్లిని సైతం రాజకీయాలకు వాడుకుంటున్న షర్మిల
చంద్రబాబు కోసం అన్న YS జగన్మోహన్ రెడ్డిని అవమానించేందుకు సిద్ధమైన షర్మిల
మరో మూడు రోజుల్లో కుమార్తె పెళ్లి పెట్టుకుని అన్న ఇంటి ముందు డ్రామాకు సిద్ధమైన షర్మిల
వైఎస్ జగన్ నివాసం ముందు ఆందోళన పేరుతో హైడ్రామాకు తెరతీయనున్న షర్మిల
ఇప్పటికే అబద్ధాలతో వైఎస్ జగన్‌పై వ్యక్తిగతంగా బురద జల్లుతున్న షర్మిల, బాబు అండ్ కో
ఉదయం 11 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి షర్మిలకు డైరెక్షన్ ఇచ్చిన చంద్రబాబు
చంద్రబాబు డైరెక్షన్‌కు అనుకూలంగా ఇప్పటికే బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమైన షర్మిల
రేపు షర్మిల బెంగళూరులో ధర్నా చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించిన పచ్చమీడియా
రేపు బెంగళూరులో అన్నా చెల్లెళ్ల బిగ్ ఫైట్ అంటూ ABN ఛానెల్లో మధ్యాహ్నం 3 గంటలకు బ్రేకింగ్
షర్మిల బెంగళూరు వెళ్తారని ముందుగానే ABNలో బ్రేకింగ్
ABN బ్రేకింగ్ కంటే ముందే చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి డైరెక్షన్
షర్మిల, చంద్రబాబు అండ్ కో చేస్తున్న కుట్రలో భాగంగానే రేపటి ధర్నా డ్రామా
రేపు షర్మిల ఏం చేస్తారో ముందుగానే ABN ఛానల్‌కు సమాచారం
చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తోన్న కుట్ర అని సుస్పష్టం
ఈ హైడ్రామాలో తనతో ఉండాలని తల్లి విజయమ్మపై ఒత్తిడి చేస్తున్న షర్మిల
వైఎస్ జగన్ ఇంటి ముందు కూర్చోవాలని తల్లి విజయమ్మపై అన్ని రకాలుగా ఒత్తిడి చేస్తున్న షర్మిల
కుమార్తె పెళ్లిని పూర్తిగా తన రాజకీయ అవసరాల కోసం వాడుకునేందుకు షర్మిల ప్లాన్
మూడంచెలుగా కుమార్తె పెళ్లి పేరుతో అన్నపై వ్యక్తిగతంగా బురదజల్లెందుకు షర్మిల కుట్ర
1.అందులో భాగంగానే ముందుగా వైఎస్ జగన్ అనుమతి లేకుండా ఆయన బెంగళూరు నివాసంలోనే వివాహం చేస్తానంటూ ప్రకటించిన షర్మిల
2.చెట్టపట్టాల్ అనే ఒక సాధారణ పదాన్ని పట్టుకుని తన క్యారెక్టర్‌పై దాడి అంటూ తన వ్యక్తిత్వాన్ని తానే తక్కువ చేసుకుంటూ ఎల్లో మీడియాకు ఆయుధాన్ని అందించిన షర్మిల
3.ఇప్పుడు వైఎస్ జగన్ బెంగళూరు నివాసం ముందు ధర్నా పేరుతో మరో హైడ్రామాకు ప్లాన్
ఇప్పటికే షర్మిల కూతురు వివాహంపై స్పష్టమైన ప్రకటన చేసిన వైఎస్ జగన్
అయినా వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా కించపరిచేందుకు మరోసారి సిద్ధమైన షర్మిల
వివాదరహితంగా తన కూతురు పెళ్లి చేస్తానని అక్టోబర్ 31న చెప్పిన షర్మిల మరోసారి కుట్రలకు ప్లాన్
ఇప్పుడు తన కూతురు వివాహాన్ని వివాదం చేసి.. వైఎస్ జగన్‌ను బద్నాం చేసేందుకు పక్కా ప్లాన్
మొత్తం చంద్రబాబు డైరెక్షన్లో... ఎల్లో మీడియా స్క్రీన్ ప్లే ప్రకారం డ్రామాకు సిద్ధమైన షర్మిల
ఏపీ స్థానిక ఎన్నికల్లో టీడీపీ చేస్తున్న హింసాకాండతో ...
దేశవ్యాప్తంగా మసకబారిన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్
దేశవ్యాప్తంగా నారా లోకేష్ రెడ్ బుక్‌పై దుమ్మెత్తి పోస్తున్న మేధావులు
హింసాకాండ నుంచి దృష్టిమల్లించేందుకు షర్మిలతో కొత్త డ్రామాకు తెరతీసిన చంద్రబాబు
తనకు చెందని, హక్కులేని ఆస్తులు కోసమే కాదు.. అంతకు మించి
రాజకీయ ఆకాంక్ష కోసం పదేపదే షర్మిల ఆరాటం
YS జగన్‌పై షర్మిల రాద్ధాంతం వెనుక అసలు ఉద్దేశం ఇదే
పచ్చ ముఠాతో అంతర్గత పొత్తు అందుకే ..
బాబు డైరెక్షన్, పచ్చముఠా అండతో.. సొంత అన్న టార్గెట్‌గా అడుగులు
ఇదే క్రమంలో తనది కాని యలహంక ఆస్తిపై రచ్చ
YS జగన్‌ను రాజకీయంగా దెబ్బతీసే కుట్రలో పావుగా మారిన షర్మిల
#YSSharmila #YSJagan #YSRCP #CBN #Yellowmedia #AndhraPradeshNews @YSRCParty@ysrcp_usa@YSRCP_Italy@YSRCP_Germany
విశాఖలో భారీ విధ్వంసం జరుగుతోంది. కొండలను కూటమి ఎలుకలు తొలిచేస్తున్నాయి. అభివృద్ధి ముసుగులో కొండలను తవ్వేస్తున్నారు. ప్రకృతికే సవాల్ విసురుతూ కాసులు మూట కట్టుకుంటున్నారు.
YSRCP హయాంలో ప్రభుత్వ భవనాలు కట్టడానికి రుషి కొండను కాస్త తొలిస్తే రచ్చ చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారు..? రుషులు తప్పస్సు చేసుకునే కొండ అంటూ రచ్చ రచ్చ చేసిన పవన్ కల్యాన్ ఇప్పుడెందుకు మాట్లాడటంలేదని పర్యావరణ వేత్తలు ప్రశ్నిస్తున్నారు.
తాజాగా టాలీవుడ్ హీరోయిన్ చాందిని చౌదరి కూడా విశాఖలో పర్యావరణ విధ్వంసంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె నానా రకాలుగా ట్రోల్ చేసింది జనసేన, టీడీపీ సోషల్ మీడియా. టీడీపీ, జనసేన సోషల్ మీడియా ఒక్కటి ఆలోచించాలి.. ప్రతి ఒక్కటీ రాజకీయానికి ముడి పెట్టకూడదు. విచక్షణ, నాలెడ్జ్ అనేది ఉండాలి. భవిష్యత్తు తరాలపై బాధ్యత ఉండాలి. పర్యావరణ విధ్వంసం జరగడం వల్లనే.. సముద్రాల ఉపరితలం వేడెక్కి ఎలో నినో పరిస్ధితులు ఏర్పడుతున్నాయి. ఈ వాస్తవాన్ని టీడీపీ, జనసేన సోషల్ మీడియా ఎందుకు మరిచిపోతుంది. పర్యావరణం పట్ల పాలకులకే ఎక్కువ బాధ్యత ఉండాలి. పాలకుల పక్షాన ఉండే సోషల్ మీడియాకు మరింత బాధ్యత ఉండాలి. పాలకులు తప్పు చేస్తుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత సోషల్ మీడియాదే.
సింహాచలం కొండలను కూడా తొలిచేస్తున్నారు.. పంచధార కొండలను తవ్వేస్తున్నారు..
కూటమికి ప్రజలు పాలనా పగ్గాలు అప్పగించింది కొండలను తవ్వుకుని, పర్యావరణాన్ని విధ్వంసం చేయడానికా..?. పర్యావరణం, ప్రకృతి అనేవి మానవుల సంపద. ఇవి బాగుంటేనే మనిషి మనుగడ సాధ్యం.సింహాచలం కొండల్లో ఇప్పటికీ.. సాధువులు, రుషులు ఉంటారు. మౌనజ్ఞానం చేస్తుంటారు. తపస్సులో ఉంటారు. వరహాస్వామి ఆరాధనలో ఉంటారు. అటువంటి కొండలను కొండలను కూడా స్వార్ధం కోసం తవ్వేస్తే భవిష్యత్తులో మనుగడ సాధ్యమా..?
అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణే కదా..? ఆయన ఎందుకు మాట్లాడటం లేదు..? డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌కు బాధ్యత లేదా..?. ఈ రోజున ప్రశ్నించకపోతే..భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసినట్లే కదా..?. సినిమాల్లో హీరోగా పవన్ కల్యాణ్ చాలా డైలాగులు చెప్పి ఉంటారు. సీజ్ ద షిప్ అన్నంత ఈజీగా సేవ్ ద హిల్స్ అంటూ పవన్ కల్యాణ్ డైలాగ్ ఎందుకు చెప్పరు..?. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినంత మాత్రానా తప్పులను ప్రశ్నించకూడదనే రూల్ ఉందా..? రాజ్యాంగం చెబుతుందా..? పవన్ కల్యాణ్ ఇప్పటికైనా తెర మీదనే కాదు.. పాలిటిక్స్‌లో కూడా హీరోనని నిరూపించుకోవాలి.
#SavetheHills #SaveAndhraPradesh #AndhraPradeshNews #SaveVishakapatnam #PawanKalyan #JSP #TDP #CBN #YSRCP #YSJagan
@YSRCParty@ysjagan@JanumalaSyam@ysrcp_usa@VizagYSRCP@YSRCPEurope@YSRCP_Italy@YSRCP_Germany@YSRCPGermany@ysrcpaus@we_ysrcp@YSRCPCommanders
రామాయపట్నం పోర్టుకు కస్టమ్స్ గుర్తింపుపై YS జగన్ హర్షం
YSRCP హయాంలో జరిగిన అభివృద్ధి ఫలిస్తోందంటూ ట్వీట్
ఏపీ పారిశ్రామిక అభివృద్ధికి పోర్టులే చోదక శక్తులు: YS జగన్
పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణే ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ
కస్టమ్స్ గుర్తింపు రామాయపట్నం పోర్టుకు కీలక మైలురాయి
దిగుమతులు,ఎగుమతులకు కస్టమ్స్ పోర్టుగా CBIC నోటిఫై చేసింది
మా హయాంలో పోర్టుల నిర్మాణాలను రూపొందించాం
ఏపీలో విస్తారమైన తీరప్రాంతాన్ని ఉపయోగించుకుని..
నాలుగుపోర్టుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం: వైఎస్ జగన్
రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట..
కాకినాడపోర్టుల నిర్మాణమే లక్ష్యంగాప్రణాళిక రూపొందించాం
ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు చొప్పున..
తీరప్రాంత మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక
10 ఫిషింగ్ హార్బర్లు,6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు చర్యలు చేపట్టాం
పోర్టుల ఆధారంగా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది
రామాయపట్నం పోర్టును..
ప్రధానవృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేశాం
రామాయపట్నం పోర్టు పరిసరాల్లో..
భారీ పెట్టుబడులకు కార్యరూపం దాల్చాయి: వైఎస్ జగన్
BPCL భారీ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు..
ముందడుగు పడింది: వైఎస్ జగన్
ఇండోసోల్ సోలార్ సమగ్ర తయారీ పరిశ్రమతో పాటు..
మరిన్ని భారీ పెట్టుబడులకు అవకాశం లభించింది: YS జగన్
లక్షల కోట్ల పెట్టుబడులు..వేలాది ఉద్యోగాలకు మార్గం..
భారీ పారిశ్రామిక వ్యవస్థకు పునాది పడింది: YS జగన్
దావోస్ నుంచి CII సదస్సుల వరకు ప్రభుత్వం చెప్తున్న..
పోర్టులు మా ప్రభుత్వ హయాంలో ప్రారంభించినవే: YS జగన్
పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు..
మేంచేపట్టిన పోర్టులనే ప్రభుత్వ గొప్పగా చెప్పుకుంటోంది: YS జగన్
#YSJagan #RamayapatnamPort #AndhraPradesh #AndhraPradeshNews #APNews @YSRCP_Italy@YSRCP_Germany@YSRCParty@we_ysrcp@ysrcp_usa@YSRCPEurope
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి నన్ను హత్య చేయడానికి కుట్ర పన్నారు: పెద్దారెడ్డి
నన్ను చంపి రాజకీయ ప్రత్యర్ధి లేకుండా చేసుకోవాలని జేసీ భావిస్తున్నారు: పెద్దారెడ్డి
తాడిపత్రిలో YSRCPలో యాక్టివ్‌గా పని చేసే 24 మందిని చంపుతానని జేసీ బెదిరించాడు
500 మందితో నా ఇంటిపై దాడి చేశారు: పెద్దారెడ్డి
పెట్రోల్ బాంబులు విసిరి ఇంటి వద్ద వున్న వాహనాలకు నిప్పు పెట్టారు: పెద్దారెడ్డి
నామినేషన్లు వేయకుండా YSRCP సానుభూతిపరులపై దాడులు చేస్తున్నారు: పెద్దారెడ్డి
#JungleRajInAP #GundarajInAP #tadipatri #PeddaReddy #TDP #JCPrabhakarReddy @YSRCParty@ysjagan@YSJaganTrends@YSRCPCommanders@YSRCPLegalCell@ysrcp_usa@we_ysrcp@YSRCPGermany@YSRCP_Italy@YSRCPUSA@ysrcpaustralia@RiseofYSJagan
మాజీ YSRCP MLA కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టిన టీడీపీ గూండాలు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో దాడి జరిగిందని చెబుతున్న YSRCP నేతలు. ఏపీలో పరిస్ధితి ఎలా ఉందంటే.. మాజీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా భద్రత లేకుండా పోయింది. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి..?. మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగితే పోలీసులు కన్నెత్తి చూడని పరిస్థితి. ఇంతకంటే దారుణం ఉంటుందా..?
#JungleRajInAP @TDPgoondsAttackOn #Tadipatri @YSRCParty@ysjagan@JanumalaSyam@YSJaganTrends@ShashuKillerboy@ysrcp_usa@YSRCPEurope
టీడీపీ నేతలు, కార్యకర్తలు , అల్లరి మూకలు YSRCP MPలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
మున్సిపల్ ఎన్నికల మొదటి రోజే YSRCP ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ మూకలు హత్యాయత్నం చేశాయి. ఈ రోజు MP YS అవినాష్ రెడ్డి టార్గెట్‌గా పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. ఎందుకు..?.
1. YSRCP టాప్ నేతలనే టార్గెట్ చేస్తే.. YSRCP క్యాడర్ భయపడుతుందనేది టీడీపీ రాజకీయ వ్యూహం కావొచ్చు.
2. YSRCP MPలనే టార్గెట్ చేస్తే.. ఓటర్లు భయపడతారు.. ఓటు వేయడానికి బయటకు రారు. ఓటర్లు రాకపోతే రిగ్గింగ్, సైక్లింగ్ చేసుకోవచ్చు అనేది టీడీపీ నేతలు రాజకీయ వ్యూహం కావొచ్చు.
3. మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇద్దరూ YSRCPలో బలమైన నేతలు. ఇద్దరికీ గ్రౌండ్ లెవల్లో కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ కార్యకర్తలను దేవుళ్లులాగా చూసే నాయకులు. ఈ ఇద్దరిపై దాడి చేస్తే కార్యకర్తలు భయపడి బయటకు రారు అనేది టీడీపీ మూకల వ్యూహం కావొచ్చు.
4.YSRCP లోక్‌సభ పక్ష నాయకుడు మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై దారుణంగా దాడి చేశారు. పోలీసుల సాక్షిగా దాడి చేశారు. మిథున్ రెడ్డి గన్ మేన్లు కాల్పులు జరిపి ఉండకపోతే.. విషాద ఘటన జరిగేదేమో..?
5. ఈ రోజు అవినాష్ రెడ్డి మీద టీడీపీ నేత బీటెక్ రవి నాయకత్వంలో దాడి చేశారు. పోలీసులు చూస్తుండగానే పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు. రెండు ఘటనలు కూడా పోలీసులు సాక్షిగానే జరిగాయి.
6. రెండు ఘటనలు పోల్చి చూసినప్పుడు స్పష్టంగా కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇటువంటి దాడులు చేయగలరు.
పోలీసులు - టీడీపీ నేతలు కుమ్మక్కు అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
7. అవినాష్ రెడ్డి పీఎస్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినా పోలీసులు పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఒక ఎంపీ పీఎస్ దగ్గర గంటకుపైగా వెయిట్ చేసినా పోలీసులు పట్టించుకోకపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి.
8.అంతేకాదు.. రెడ్డి సామాజికవర్గంలోని టాప్ నేతలను టార్గెట్ చేయడం ద్వారా .. ఆ సామాజిక వర్గంలో భయాందోళన క్రియేట్ చేయాలని కుట్ర కూడా దాగుండొచ్చు.
ఏదిఏమైనా.. ఏపీలో ప్రజాస్వామ్యం , ఎన్నికల వ్యవస్థ ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నాయి. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉంది.
#YSRCP #LocalBodyElections2026 #APNews #AndhraPradeshNews @YSRCParty@ysjagan@MithunReddyYSRC@YsAvinash@ChittoorYSRCP@CanadaYsrcp@ysrcp_usa@YSRCP_Italy@YSRCPEurope@YSRCPCommanders@YsrcpRe51288@we_ysrcp @YSRCPvishka @YsrcpMedi
స్థానిక ఎన్నికలకు ముందు జనసేన నేతలు, ఎమ్మెల్యేలు తొడలు కొట్టారు. 40శాతం తక్కువుగా సీట్లు ఇస్తే తీసుకునేది లేదన్నారు.సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, వాయిస్‌లు ఇచ్చి హడావుడి చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తగ్గించుకుని త్యాగం చేశామని చెప్పుకొచ్చారు. లోకల్ బాడీ ఎన్నికలంటే కింది స్థాయి కార్యకర్తల ఎన్నికలు కాబట్టి.. కార్యకర్తలకు న్యాయం చేయాలని పవన్ కల్యాణ్ కూడా చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికల్లో టీడీపీ కూడా త్యాగం చేయాలని పలుమార్లు జనసేన నేతలు కోరారు.అంతేకాదు.. స్థానిక ఎన్నికల్లో సీట్ల కోసమంటూ జనసేన కేంద్ర కార్యాలయం కమిటీల పేరుతో హడావుడి కూడా చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 40శాతం సీట్లు డిమాండ్ చేసిన జనసేనకు మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 14 శాతం సీట్లు మాత్రమే దక్కాయని జనసేన నేతలే చెబుతున్నారు. పరిషత్ ఎన్నికల్లో మరీ దారుణం 659 మండల పరిషత్‌ల్లో 626 చోట్ల అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఇందులో టీడీపీ 534, జనసేన 42, బీజేపీ 7 మండలాల్లో ఎంపీపీ పదవులు దక్కించుకున్నారు. ఈ లెక్కన పరిషత్ ఎన్నికల్లో జనసేనకు 7 శాతం సీట్లు మాత్రమే దక్కాయి. ఒక మండల పరిషత్ ఉపాధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ 445, జనసేన 83, బీజేపీ 20 వైస్ ఎంపీపీ పదవుల్ని దక్కించుకున్నాయి. ఇక్కడ జనసేనకు 12 శాతం సీట్లు మాత్రమే దక్కాయి. జనసేనకు 15 శాతం సీట్లు ఇస్తున్నామని లోకేష్ ప్రకటిస్తే.. టీడీపీ నేతలు రచ్చరచ్చ చేశారు. మరీప్పుడు లోకేష్ చెప్పిన దానికంటే తక్కువ సీట్లు జనసేనకు దక్కాయి. ఇదే.. కిందిస్థాయి జనసేన కార్యకర్తల్లో ఆందోళనకు గురి చేస్తుంది.
జిల్లా పరిషత్ కేటాయింపుల్లోనూ జనసేనకు అంత సీన్ లేదని తేలిపోయింది. మొత్తం 28 జిల్లా పరిషత్‌ల్లో YSRCPకి ఒక్కటి దక్కింది. మిగిలినవి కూటమి వశమయ్యాయి. ఇందులో టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి ఒక్కటి దక్కాయి. అంటే.. జనసేనకు 15 శాతం సీట్లు మాత్రమే దక్కాయి. మరీ..లోకేష్ లెక్క తప్పలేదనే కదా అర్ధం.
లోకల్ బాడీ ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పెద్ద పెద్ద స్పీచ్‌లు ఇస్తూ వచ్చారు. స్థానిక ఎన్నికల్లో జనసేన ప్రతాపం చూపాలన్నారు. కానీ.. వాస్తవానికి వచ్చే సరికి చంద్రబాబు, లోకేష్ మాటే చెల్లుబాటు అయింది.
మరోవైపు పవన్ కల్యాణ్ మాటలు కూడా.. జనసేన నేతలను, కార్యకర్తలను బాధకు గురి చేస్తున్నాయి. సీట్ల పంపిణీకి అర్నాబ్ తుఫాన్ అడ్డొచ్చిందని పవన్ కల్యాణ్ చెప్పడాన్ని జనసేన క్యాడర్ జీర్ణించుకోలేక పోతుంది. అంతేకాదు.. 2024 సాధారణ ఎన్నికల్లో టీడీపీ బలంగా ఉండటాన్నే జనసేన 21 సీట్లు గెల్చుకుందని పవన్ కల్యాణ్ చెప్పడాన్ని జనసేన జెండా మోసిన జనసేన కార్యకర్తలు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. మరో 25 ఏళ్లు టీడీపీ జెండా జనసేన నేతలు, కార్యకర్తలు మోయాలనే విధంగా పవన్ కల్యాణ్ మాట్లాడటాన్ని కిందిస్థాయి పవన్ అభిమానులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు.
పొత్తులో ఉన్నప్పటికీ, త్యాగాలు చేశామని చెబుతున్నప్పటికీ.. తమకు రాజకీయంగా ప్రయోజనం జరిగింది శూన్యమేనని జనసేన నేతల ఆవేదన. ఏదిఏమైనా.. చంద్రబాబు, లోకేష్ రాజకీయం ముందు పవన్ కల్యాణ్ ఓడిపోయాడనే చెప్పాలి.
#APNews #AndhraPradeshNews #LocalBodyElections2026 #TeluguNews #JSP #PawanKalyan #PK #JanaSena