ధన్యవాదాలు @VVL_Official సార్ 🙏
మీ మద్దతు నాకు కొండంత నైతిక బలాన్ని ఇచ్చింది.
రాజకీయాల్లో ప్రతిభకు స్థానం ఉండాలని, ప్రతిభకు పట్టం కట్టాలని మీరు పడుతున్న తపనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
రాజకీయ భేషజాలు లేకుండా ఉన్నతమైన లక్ష్యంతో మీరిచ్చిన ఈ సందేశం తెలంగాణ యువతను కదిలిస్తుంది. ఆలోచింపజేస్తుంది.
రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో https://t.co/CBBDljLL57 : 3 లో గల నా పేరు ఏనుగుల రాకేష్ రెడ్డికి ఎదురుగా డబ్బాలో మొదటి (1) ప్రాధాన్యత తో మద్దతు తెలిపి ఆశీర్వదించగలరని గ్రాడ్యుయేట్స్ కి నా ప్రార్ధన.
సూర్యాపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన దగ్గుపాటి వైష్ణవి కుటుంబానికి న్యాయం జరగాలని మృతురాలి తల్లిదండ్రులు పాఠశాల ఎదుట చేపట్టిన ధర్నాలో పాల్గొన్నాను.
మృతురాలి తల్లిదండ్రులు నినదిస్తున్నది ప్రభుత్వం ప్రకటించిన "ఆరు గ్యారంటీల" అమలు కోసం కాదు..వాళ్ళ బిడ్డల ప్రాణాలకు “గ్యారంటీ” కావాలని పుట్టెడు శోకంలో బాధాతప్త హృదయాలతో నినదిస్తున్నారు.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 60 రోజులు పూర్తయింది. కానీ ముఖ్యమంత్రి @revanth_anumula గారు ఎస్సీ,ఎస్టీ,మైనారిటీ సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించలేదు. ఈ బిడ్డల గోడు ఎవరికి చెప్పుకోవాలి?
అసెంబ్లీలో అన్నీ చర్చిస్తున్నారు కానీ, గురుకులాలు/వసతి గృహాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై మాత్రం చర్చ జరగడం లేదు.ఎందుకు?
ఈ బిడ్డల ప్రాణాలకు విలువలేదా?
లేక మీ బిడ్డలు ఇలాంటి సంక్షేమ హస్టళ్లలో చదవడంలేదని చర్చిస్త లేరా?
ప్రజా పాలన అంటే ఇదేనా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వద్ద ఉన్న ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ సంక్షేమ శాఖలకు తక్షణమే మంత్రులను నియమించాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహన్ని పరిశీలించాను. గత వారం ఆత్మహత్యకు పాల్పడ్డ 10వ తరగతి విద్యార్థినిలు భవ్య,వైష్ణవిల కుటుంబ సభ్యులను కలసి వారి ఆవేదనను విన్నాను. ఈ ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్న ముఖ్యమంత్రి @revanth_anumula గారు స్పందించకపోవడం, అసెంబ్లీ సమావేశాలలో అధికార, ప్రతిపక్ష నాయకులు చర్చించకపోవడం దురదృష్టకరం.
విద్యార్థినిల ఆత్మహత్యలపై తక్షణమే ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలి.మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియాతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ,ప్రైవేటు విద్యా సంస్థలతోపాటు జనరల్,బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ సంక్షేమ గురుకులాలు,వసతి గృహాల్లో చదివే విద్యార్థుల కోసం యుద్ద ప్రాతిపదికన సైకాలజిస్ట్ లను/కౌన్సిలర్లను నియమించాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
@TelanganaCS
ప్రస్తుత TSPSC బోర్డును తక్షణమే రద్దు చేయకపోతే సోమవారం నుండి తెలంగాణ వ్యాప్తంగా బీయస్పీ ఆధ్వర్యంలోఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం✊మా నిరుద్యోగ బిడ్డలను కాపాడుకుంటాం. పోలీసులను అడ్డం పెట్టి అడ్డుకుంటే రాష్ట్రం అగ్నిగుండం ఐతది. ఖబర్దార్ కేసీఆర్.!
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారీమణి చాకలి (చిట్యాల) ఐలమ్మ వర్ధంతి నేడు.నాడు దొరల గడీల భూస్వామ్య పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి భూమి కోసం,భుక్తి కోసం పోరాడిన ధీరవనిత.
ఐలమ్మ చేసిన పోరాటం, త్యాగం తెలంగాణలోని బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక,మహిళా చైతన్యానికి,శక్తికి స్ఫూర్తిదాయకం.
ఆమె ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తితో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బహుజనులమంతా రాజకీయంగా ఏకమై దొరల గడీల పాలనను కూల్చి, బహుజన రాజ్యం నిర్మిద్దాం. ఇదే ఆమెకు ఘనమైన నివాళి.
#VR99
ప్రభుత్వం ప్రకటించే సంక్షేమ పథకాలు దళిత బంధువు గాని గృహలక్ష్మి గాని ఏ సంక్షేమాల పథకమైన ఎమ్మెల్యే అనుచరులకి పార్టీ కార్యకర్తలకు పంచడం జరుగుతుంది దానికి నిరసనగా ఆలేరు బహుజన సమాజ్ పార్టీ మండల కమిటీ ఆలేరు @SunithaTRS
కేసీఆర్ పాలనలో సూర్యాపేట కాశ్మీరును తలపిస్తున్నది! వట్టె జానయ్య యాదవ్ గారి మాతృమూర్తిని పరామర్శించడం ఏమైనా ఉగ్రవాద చర్యనా, మంత్రి జగదీష్ రెడ్డి గారు? ఎందుకు మాపై అడుగడుగునా అంక్షలు విధిస్తున్నరు??
తన ఉద్యోగాన్ని వదిలి పేదింటి బిడ్డల చదువులకై స్వేరో సంస్థలో కీలకంగా పని చేసి
నమ్మిన నాయకుడి కోసం నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమిస్తూ రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కందికంటి విజయ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ లో ఒక గిరిజన మహిళ పై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని నేను ఖండిస్తున్నా. కానీ దీనికి కారణం మనమే. దీనికి పాలకులను, పోలీసులను నిందించి లాభం లేదు.
ఇదే పోలీసులు అగ్రవర్ణాల్లో ఉండే దొరల కుటుంబాల(1%) మీద ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగించ గలరా?
No. They won’t.
ఇటీవల వంద కోట్ల లిక్కర్ ముడుపుల కుంభకోణంలో నిందితురాలైన ఒక దొరల కుటుంబానికి చెందిన ఒక ఎమ్మెల్సీని పోలీసులు పోలీస్ స్టేషన్ కు పిలిపించకుండా ఆమె అపాయింట్మెంట్ తీసుకొని బంగళాకు పోయి ఆమె స్టేట్మెంటు రికార్డు చేసిండ్రు! ఇంటి బయట వందల సంఖ్యలో ఈ నిందితురాలి ఇంటి బయట పోలీసులు బందోబస్తు కల్పించిండ్రు. పోయిన సంవత్సరం జుబ్లీ హిల్స్‌లో ఒక మహిళను పట్టపగలే లగ్జరీ వాహనంలో అత్యాచారం చేసిన బడాబాబుల మీద టార్చర్ ప్రయోగించారా? లేదు.
కట్ చేస్తే….
మరియమ్మ అనే ఎస్సీ మహిళను అడ్డగూడూరు పోలీసు స్టేషన్ నో దొంగతనం చేసిందన్న నెపంతో థర్డ్ డిగ్రీ టార్చర్ చేసి చంపారు పోలీసులు. దీనికి కారణం మనమే.
ఇదే సంవత్సరం ఖదీర్ ఖాన్ అనే యువకుడిని చిన్న దొంగతనం చేసిండన్న అనుమానం మీద రామాయంపేట పోలీసులు థర్డ్ డిగ్రీ చేస్తే అతను మరణ వాంగ్మూలం ఇచ్చి మరీ చనిపోయాడు. దీనికి కారణం మనమే.
సిరిసిల్ల నేరెళ్లలో దొరల ఇసుక దందాలను అడ్డుకున్నందుకు బహుజన వర్గాలకు చెందిన ఎనిమింది యువకులను రహస్యంగా నాలుగు రోజులు కరెంటు షాకులతో చిత్రహింసలు పెడితే ఇంత వరకు వాళ్లు మామూలు మనుషులు కాలేదు. దీనికి కారణం మనమే.
హైదరాబాద్ పాత బస్తీలో షేక్ బవాజీర్ అనే సామాజిక కార్యకర్త నన్ను దుండగులు చంపుతారు రక్షించండి మహాప్రభో అని సాక్షాత్తు హోం మంత్రి మహమూద్ అలీ ని వేడుకున్నా అతని ప్రాణాలు దక్కలేదు!
విచిత్రం ఏంటంటే ఈ థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులు కూడా చాలా వరకు పేద సామాజిక వర్గాలకు చెందిన వారే. మరి వారు అమానవీయంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?
ఎందుకంటే వాళ్లకు వాళ్ల పీడిత వర్గాల మీద ఎంత ప్రేమ ఉన్నా, వారికి తెలుసు దొరల కుటుంబాల్లో ఎవరిని ముట్టుకున్నా వాళ్ల ఉద్యోగాలు ఊడతాయని. మంచి పోస్టింగులు రావని. వెంటనే ఉన్నతాధికారుల నుండి ఫోన్, MLA ల నుండి బెదిరింపులు, మీడియా బ్రేకింగ్ న్యూస్, లాయర్ల హెబియస్ కార్పస్ పిటీషన్లు, డిపార్టుమెంటల్ ఎంక్వైరీలు, ఏసీబీ దాడులు…మరెన్నో….
ఇంతటి పకడ్బందీ వ్యవస్థను కేవలం 1% ఉన్న పాలక వర్గాలు, 99% ఉన్న మనం అమాయకంగా వారికి ఇచ్చిన అధికారంతో దుర్భేద్యంగా నిర్మించుకున్నరు. ఎప్పుడైనా ఈ పేద బాధితుల గురించి అగ్ర వర్ణ సీయం ప్రెస్ మీట్ పెట్టడం చూసిండ్రా?
99% ఉన్న పేద ప్రజలను హింసిస్తే ఏ ఎమ్మెల్యే మాట్లాడడు. వాళ్లకు తెలుసు నోరు తెరిస్తే బిగ్ బాసుల నుంచి ఎట్లాంటి టార్చర్ ఉంటదో! మళ్లీ టికెట్ రాదు, అసమ్మతి సెగలు, విజిలెన్సు దాడులు, పోలీసు కేసులు, భూముల రీ సర్వేలు, మరెన్నో…!
మనకు పత్రికలు ఛానల్లు ఉండే సవాలే లేదు కాబట్టి మన గురించి పెద్దగా రాసే వాళ్లే ఉండరు. తినడానికి తిండే దొరకని మనకు హైకోర్టు న్యాయవాదులను ఆశ్రయించడం నేల విడిచి సాముచేయడం లాంటిది. మన గురించి న్యాయస్థానాలకు హృదయం ద్రవించి సుమోటో (Suo Moto) పిటీషన్లను తీసుకునే అవకాశం పెద్దగా లేదు ఎందుకంటే అందులో 80% నేటికి అగ్రవర్ణాలకు చెందిన న్యాయమూర్తులే ఉన్నరు.
Current system, by design, is built by the vocal 1% to protect the high and mighty and punish the weak and voiceless and the silent majority(99%). This must be demolished.
అందుకే 99% బహుజనులు 1% నుండి అధికారాన్ని గుంజుకోవాలె. వడ్డించే వాడు మన వాడు కావాలి. మెజారిటీ మనముండి రోజూ తన్నులు తినుడేంది? అడుక్కొనుడు ఏంది??
అందుకే మాన్యశ్రీ కాన్షీరాం గారు బహుజన్ సమాజ్ పార్టీని నిర్మించారు. బెహన్జీ@Mayawati గారి పాలనలో పేద వర్గాలకు ఎలాంటి రక్షణ దొరికిందో చరిత్ర చూడండి.
అందుకే మనకు తెలంగాణలో ఈ సారి బహుజన రాజ్యం రావాలి. We are 99%
*This post applies to all departments, not just police. Police atrocities are just a symptom of a deeper syndrome. I dedicate this post to all those impartial and honest policemen and public servants who still have their heart for helpless.
#Kanshiram #BSP4Telangana #Time4Blue #LiberateTelangana #VR99
ఇదీ తెలంగాణ గ్రామాల్లో రోడ్ల పరిస్థితి! కేవలం మీ ఫాంహౌసులకు, బంగళాలకు అద్దం లాంటి రోడ్లు వేసుకుంటే సరిపోతదా #KCR గారూ? तेलंगाना के गावों में सडक़ों का बुरी हालत देखिए। One needs to be gymnast to negotiate the rural roads in Telangana in monsoon!
#KCRfailedTelangana
కులం పేరుతో దూషించిన BRS ఎమ్మెల్సీ @KaushikReddyBRS పై తక్షణమే SC,ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. అధికారం అడ్డంపెట్టుకొని కుల దూరహంకారంతో కళ్ళు నెత్తి కెక్కి దళితుడైన ప్రోటోకాల్ డ్రైవర్ పై చేయి చేసుకోవటం దారుణం. గతంలో కూడా మన ముదిరాజ్ బిడ్డ అజయ్ అనే జర్నలిస్టును కులం పేరుతో దూషించి,చంపేస్తానని బెదిరించాడు.
ఇవన్నీ ముఖ్యమంత్రి #KCR, #KTR డైరెక్షన్ లోనే జరుగుతున్నాయి. దళితులు,ముదిరాజ్ ల మనోభావాలను కించపరిచిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ముఖ్యమంత్రి వెంటనే బర్తరఫ్ చేసి, PD Act కింద జైలుకు పంపించి, బహిరంగ క్షమాపణ చెప్పాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
రాజ్యాధికారం లేని జాతులు అంతరించిపోతాయి. అందుకే కనీసం ఇప్పుడైనా మన పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసుకుందం.
కారంచేడు మృతవీరులకు ఘనమైన నివాళి🙏🙏🙏 #Karamchedu#BSP
ఇదీ పది సంవత్సరాల కేసీఆర్ -కోనప్ప ల దోపిడి పాలనలో సిర్పూర్ నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి!! ఇక్కడ రోజూ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతూంటే, ముఖ్యమంత్రి గారు, వాళ్ల ఎమ్మెల్యే లు ప్రజల సొమ్ముతో విందుల్లో మునిగితేలుతున్నారు.
#KCRfailedTelangana
బహుజన్ సమాజ్ పార్టీ(BSP) దక్షిణ తెలంగాణ జిల్లాల మహిళా కన్వీనర్ల కేడర్ క్యాంపుకు వచ్చిన చెల్లెలందరికి జై భీం🙏 బెహన్జీ @Mayawati గారి కలలను నిజం చేయడానికి మీరు రాత్రింబవళ్లు శ్రమిస్తున్న తీరు అమోఘం. రాబోయే బహుజనరాజ్యంలో మీ భూమిక చారిత్రాత్మకంగా ఉండబోతున్నది. ✊
సూర్యాపేట జిల్లా కోదాడలో సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది,పారిశుద్ధ్య కార్మికులతో వీడియో కాల్ మాట్లాడిన. రెక్కాడితే గాని డొక్కాడని గ్రామపంచాయతీ కార్మికులు చాలీ చాలని జీతం,పని ఒత్తిడి,తీవ్ర మనో వేదనతో బ్రతుకుతున్నారు. కార్మికుల గోడు వింటే గుండె బరువెక్కి పోతున్నది.
అయ్యా...కేసీఆర్ గారు, మీరు సెక్రటేరియట్ కు రాకుండానే నెలకు ₹ 3,36,000 జీతం తీసుకుంటున్నారు. కానీ,నిత్యం శ్రమ దోపిడీకి గురవుతూ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న వేలాదిమంది సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం నెలవారీ జీతాలు సకాలంలో ఎందుకు చెల్లించడం లేదు?
గ్రామపంచాయతీ కార్మికులు తమ వేతనాల పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేసినా ఈ నియంతలు పట్టించుకోవడం లేదు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులందరినీ వెంటనే పర్మనెంటు చేయాలని బీఎస్పీ డిమాండ్ చేస్తుంది.
కార్మికులారా!,
వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందడం కోసం ఆధిపత్య పార్టీలు ఇచ్చే మోసపూరిత హామీలను నమ్మి మరోసారి మోసపోకండి.
బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే కార్మికులందరిని పర్మినెంట్ చేస్తాం.పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం ఆ కుటుంబాలకు చెందిన నిజాయితీ ఉన్న నాయకులకు మంత్రుల హోదా ఇస్తాం. ప్రమాదకర జీవితాల నుంచి కార్మికులను విముక్తి చేస్తాం.
కార్మికుల కష్టాలు తీర్చే ఏకైక పార్టీ బీఎస్పీనే. దయచేసి నమ్మండి. అధికారం ఇవ్వండి.🙏
ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో ఆగ 'మేఘా'ల మీద పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC) నుండి లక్ష కోట్లు అప్పు తెచ్చి కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన #KCR గారు వేలాది మంది పేద విద్యార్థులు చదివే ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ సంక్షేమ గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించడానికి మాత్రం బడ్జెట్ లో నిధులు కేటాయించడంలేదు.
సంక్షేమ గురుకులాల్లో అత్యుత్తమ విద్యా బోధన అందిస్తున్నామని మైకు దొరికితే చాలు వేదికలెక్కి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేద విద్యార్థుల గోడు ఏమాత్రం పట్టదు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త గురుకులాల స్థాపించి ఏండ్లు గడుస్తున్నా విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు లేవు.అన్ని సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో BC-450, SC-130,ST-60 గురుకులాలు అద్దె భవనాల్లో,అరకొర సౌకర్యాలతో కొనసాగుతున్నాయి. గురుకులాలకు స్వంత భవనాలు లేక విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తోంది.
₹50 కోట్లతో ప్రగతి భవన్,₹1,200 కోట్లతో కొత్త సెక్రటరీయేట్ కట్టడానికి నిధులున్నప్పుడు,కొత్త గురుకులాలకు పక్కాభవనాల నిర్మాణం కోసం నిధులు ఎందుకు ఉండవు? పేద విద్యార్థులపై KCR కు ఎందుకింత చిన్నచూపు?
రాబోయే మా బహుజన రాజ్యంలో ప్రతి మండలానికొక అంతర్జాతీయ స్థాయిలో పాఠశాలలను ఏర్పాటుచేసి,కుల,మత విభేదాలు లేకుండా నాణ్యమైన ఉచిత విద్యను అందరికీ అందిస్తాం. మీరు చెప్పిన KG to PG లాగా మాత్రం ఉండదు.
#KCRfailedTelangana
#KCRCheatedTelangana